సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయిక నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటూ ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. కాగా జులై మొదటివారంలో మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జులై ఒకటి నుంచి ఆ నెల చివరి వరకూ నాన్ స్టాప్ గా సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేయాలనీ భావిస్తున్నారట. ఈ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.