Mahesh Babu: సాధారణంగా ఒక స్టార్ హీరో కనిపించడమే చాలా రేర్. అలాంటింది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉంటుందా.. ? సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత ఈ హీరోలిద్దరిని పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తున్నారు అభిమానులు. ఇక చాలా రేర్ గా వెంకీ మామ బయట కనిపిస్తాడు. అలాంటింది.. తాజాగా చిన్నోడితో కలిసి పెద్దోడు కనిపించేసరికి ట్విట్టర్ షేక్ అయ్యింది. ఒక ప్రైవేట్ పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Amala Paul: రెండో భర్తను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. ఇది ఎన్నాళ్లు అంటున్న అభిమానులు
ఇక ఈ ఫొటోలో ఆరెంజ్ కలర్టీ షర్ట్ లో మహేష్ కనిపించగా.. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో వెంకీ మామ కనిపించాడు. మహేష్ ఎంతో కూల్ గా క్లాస్ లుక్ లో కనిపించాడు. ఇక వెంకటేష్.. వైట్ కలర్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపించాడు. వీరిద్దరిని చూసిన అభిమానులు పెద్దోడు మాస్.. చిన్నోడు క్లాస్.. ఏమున్నార్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా.. వెంకీ మామ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. మరి ఈ రేస్ లో పెద్దోడు గెలుస్తాడా..? చిన్నోడు గెలుస్తాడా.. ? అనేది తెలియాలి.