రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహ్వానం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సి. పార్థసారధి చండీగఢ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే, SEC అనుసరించే వినూత్న చర్యలు మరియు ఉత్తమ పద్ధతులను…
‘మా’ ఎలక్షన్లు ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిన్న ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మరోవైపు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాజీనామాలు ఇచ్చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ‘మా’ ఎన్నికల సమయంలో రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా…
శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలు ముగిసిన దృష్ట్యా ఇక పై తాను, తన కమిటీ సభ్యులు ఎవరూ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారు. ఓ యేడాదితో తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని, ముగిసిన ఎన్నికల గురించి మాత్రం పెదవి విప్పమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తాను గెలవాలని కొందరు పూజలు చేశారని, వాటిని…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం…
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద…
”మా” అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తాజాగా జబర్దస్త్ కామెడీ షో యాంకర్, ప్రముఖ నటీ అనసూయ ఆసక్తి కర ట్వీట్ చేసింది. నిన్న రాత్రి తాను భారీ మెజారిటీ తో గెలిచానని చెప్పారని… కానీ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో మాత్రం తాను ఓడిపోయానని ప్రకటించారు. అసలు రాత్రికి రాత్రే ఫలితాల్లో ఇంతలా మార్పు జరిగిందా ? అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎన్నికల నిబంధనలను విరుద్ధంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ…
మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ ఎన్నికల ఓటింగ్ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు పూర్తయ్యింది. అనుభవజ్ఞుల సమక్షంలో కౌంటింగ్ ను సా. 5.00 గంటలకు మొదలు పెట్టారు. గతంలో మాదిరి కాకుండా ఫలితాలు త్వరగానే వస్తాయని అంతా భావించారు. అయినా రాత్రి 10.30 వరకూ వాటిని అధికారికంగా తెలియచేయలేదు. ముందుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలో విజేతలను ప్రకటిస్తారని, ఆ తర్వాతే ఆఫీస్ బేరర్స్ ఫలితాలు వెల్లడిస్తారని ముందు నుండి చెబుతూ వచ్చారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆఫీస్…
ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీ వర్గాలలో ఆనందాన్ని నింపాయి. దానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫలితాల అనంతరం పోస్ట్ చేసిన ట్విట్ ఉదాహరణ. ‘జాతీయ వాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు’ అని చెబుతూనే, ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించడంతో ఆ పార్టీకి ప్రకాశ్ రాజ్…
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Read also : మీడియాకి మంచి మెటీరియల్…
‘మా’ ఎన్నికలు ఉద్రిక్తతలు, తోపులాటలు, ఆరోపణలను మధ్య జరుగుతున్నాయి. సినీ స్టార్స్ ఒక్కొక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ 300లకు పైగా ఓట్లు నమోదు అయ్యాయి. మరో రెండున్నర గంటల్లో ఓటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రికి ఫలితాలు వెల్లడవ్వనున్నాయి. నేటితో ఈ ‘మా’ గొడవలకు, ఘర్షణలకు, ఆరోపణలకు, ప్రత్యారోపణలకు తెర పడనుంది. గెలిచినవారి ఇప్పటికే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు ? అనే…