దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’ మూవీతో బాకీ పడిన హిట్ ని ఈసారి #Thalapathy67 సినిమాతో సాలిడ్ గా అందుకోవాలని చూస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడో అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని విజయ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… #Thalapathy67 రెగ్యులర్ షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా గురించి పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ ని చేసేస్తున్నారు. కోలీవుడ్ హిస్టరీలోనే అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ముంబైలో జరిగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనుందట.
‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలని లింక్ చేసి ఒక యూనివర్స్ గా మార్చాడు లోకేష్ కనగారాజ్. ఈ యూనివర్స్ లోకి విజయ్ రావడంతో, #Thalapathy67 సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. దీని వల్ల కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్ లని ఒకే సినిమాలో చూడాలి అనుకున్న సినీ అభిమానులకి లోకేష్ కనగరాజ్ ఫుల్ మీల్స్ పెట్టినట్లే. ముంబై బేస్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో #Thalapathy67 సినిమా రూపొందుతుంది. విక్రమ్ సినిమా క్లైమాక్స్ ని సూర్య ఇంట్రడక్షన్ కూడా ముంబైలోనే జరిగింది. సో కథ ప్రకారం సూర్య, విజయ్ లకి లింక్ ఉండే ఛాన్స్ ఉంది. మరి సూర్య పైన విజయ్ క్యారెక్టర్ ఉంటుందా? విజయ్ కూడా గ్యాంగ్ స్టర్ గానే కనిపిస్తాడా? ఒకవేళ విజయ్ కూడా గ్యాంగ్ స్టర్ అయితే విజయ్ ని పట్టుకునే ఆ పోలిస్ ఆఫీసర్ ఎవరు? అతని క్యారెక్టర్ లో ఎవరు కనిపించబోతున్నారు? లాంటి ఇంటరెస్టింగ్ క్వేషన్స్ కి ఆన్సర్ తెలియాలి అంటే #Thalapathy67 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.