Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక కొన్నిరోజులుగా మేకర్స్ లియో పోస్టర్స్ ఫీస్ట్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మూడు రోజుల క్రితం లియో తెలుగు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా హిందీ పోస్టర్ ను రిలీజ్ చేసి.. సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను దించి దిమ్మ తిరిగేలా చేస్తున్నాడు లోకేష్. మొదటి నుంచి కూడా లోకేష్ సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
Vijay Varma: ఆమెతో శృంగారం.. వెన్నులో వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
ఇక లియో లో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండగా.. అర్జున్ సర్జా, అర్జున్ దాస్.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా విజయ్, సంజయ్ దత్ లు కలిసి ఉన్న పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి ఆ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో విజయ్ కోపంతో రగిలిపోతూ.. సంజయ్ దత్ గొంతు పట్టుకొని కనిపించాడు. పోస్టర్ లోనే వీరిద్దరి మధ్య పోరాటం ఎలా ఉండబోతుందో అభిమానులకు రుచి చూపించాడు.. లోకేష్. ఇక దీనికి కీప్ కామ్ అండ్ ఫేస్ ది డెవిల్ అంటూ రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇందులో విజయ్ నట విశ్వరూపం చూపించాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.