Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ఈ జంట లిప్ కిస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఈ మధ్యనే తమన్నా.. విజయ్ పై ప్రేమను అధికారికంగా రివీల్ చేసింది. అతనితో ఉంటే తనకు ఆనందంగా ఉంటుందని, తనను పూర్తిగా అర్ధం చేసుకున్న వ్యక్తి విజయ్ అని చెప్పుకొచ్చింది. ఇక విజయ్ సైతం తమన్నాపై ఒక్క మాట కూడా పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇంకోపక్క వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
Tamannaah Bhatia: మహిళా బిల్లు ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన మిల్కీ బ్యూటీ
ప్రస్తుతం తమన్నా, విజయ్ తమ కెరీర్లను సెట్ చేసుకొనే పనిలో ఉన్నారు. ఇక విజయ్ వర్మ ప్రస్తుతం జానే జాన్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కరీనా గురించి విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ” కరీనా కపూర్ తో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఒక గొప్ప నటి. మంచి మనసున్న మనిషి.. ఆమెతో ఎప్పటినుంచో నటించాలని అనుకున్నాను .. ఇప్పటికి తీరింది. ఇక కరీనాతో శృంగార సన్నివేశాలు చేయాలంటే.. భయమేసింది. ఇంకా చెప్పాలంటే.. నా శరీరం మొత్తం భయంతో వణికింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.