Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. నిన్ననే ఈ మెగా మేనల్లుడు తన 36 వ పుట్టినరోజును జరుపుకున్నాడు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా తేజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరి చూపు మాత్రం ఒక హీరోయిన్ చెప్పిన విషెస్ దగ్గరే ఆగిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి. అదేనండీ తేజు హీరోగా నటించిన తిక్క సినిమాలో హీరోయిన్. అప్పటినుంచి సుప్రీం హీరోను వెనకాల తిప్పించుకుంటున్న బ్యూటీ. నిర్మొహమాటంగా తేజు ఎన్నో ఇంటర్వ్యూలలో లారిస్సా అంటే తనకు క్రష్ అని, ఆమె ఒప్పుకొంటే పెళ్లి చేసేసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్ నడుస్తోంది.
ఇక తాజాగా అది కన్ఫర్మ్ అయ్యింది అంటున్నారు అభిమానులు. నిన్న తేజు బర్త్ డే కు లారిస్సా విష్ చేస్తూ ” నా తేజుకు హ్యాపీ బర్త్ డే ” అని చెప్పుకొచ్చింది. ఇక ఇందుకు సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ “నన్ను డిస్టర్బ్ చేసిన అమ్మాయి” అంటూ లవ్ ఎమోజీలు పెట్టుకొచ్చాడు. ఇక దీనికి లారిస్సా స్పందిస్తూ ” జీవితాంతం ఇలాగే డిస్టర్బ్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ గట్టిగానే ఉందని చెప్పుకొస్తున్నారు. అందరు ఒప్పుకొంటే ఈ తిక్క పిల్లతోనే సుప్రీం హీరో పెళ్లి జరగనున్నదని టాక్ నడుస్తోంది. మరి ఈ మెగా మేనల్లుడు తన ప్రేమ విషయం ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాడో చూడాలి.
Happy Birthday to my Teju @IamSaiDharamTej ♥️🎂🥳
— Larissa Bonesi (@larissabonesi) October 15, 2022