పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన విలేజ్ డ్రామా “కొండపొలం” అక్టోబర్ 8 న చాలా గ్రాండ్‌గా విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “కొండపొలం”లో అన్నపూర్ణ, హేమ, ఆంథోనీ, రవి ప్రకాష్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, మహేష్ విట్టా కీలక పాత్రల్లో నటించారు. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో రవీంద్ర పాత్రలో కన్పించగా, రకుల్ ప్రీత్ సింగ్ ఓబుళమ్మ అనే గ్రామీణ మహిళ పాత్రలో నటించింది. “కొండపొలం” చిత్రం అటవీ ఆధారిత గొర్రెల కాపరుల చుట్టూ తిరుగుతుంది.ఈ తెగకు చెందిన వారు తమ అడవిలో గొర్రెలను మాంసాహారుల దాడులు, అడవిలో పులులు నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు.
Read Also : సామ్ పిల్లలు కావాలనుకుంది… నీలిమ గుణ షాకింగ్ కామెంట్స్
అయితే ఈ సినిమా విడుదలై ఒకరోజు కూడా గడవకముందే చిత్రబృందానికి షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్. ఈ సినిమా అప్పుడే పైరసీ బారిన పడింది. నిజానికి వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రమైన “కొండపొలం”పై మంచి అంచనాలు ఉన్నాయి. టాక్ కూడా పాజిటివ్ గానే ఉండడంతో సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ క్రమంలో ‘కొండపొలం’ పైరసీ బారిన పడడం నిజంగా షాకింగ్. ఈ ఎఫెక్ట్ కొంతవరకైనా సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉంది.