Khushboo : తమిళనాడులో దారుణమైన ఘటన జరిగింది. నెలసరి కారణంతో ఓ విద్యార్థినిని బయటే కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ స్పందించారు. తన రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నెలసరి పేరుతో స్టూడెంట్ ను అలా బయట కూర్చోబెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.
Read Also : WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా!
‘అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం. ఇలాంటి ఘటనలను అస్సలు సహించకూడదు. ఇలాంటి పనులు చేసిన వారిపై ఎందుకని చర్యలు తీసుకోరు. సదరు విద్యా సంస్థలపై, మేనేజ్ మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. నెలసరి అనేది సాధారణ చర్యగా భావించాలి. మానవ సమాజాంలో ఇవన్నీ చాలా సహజమైనవి. ఇంతటి టెక్నాలజీ రోజుల్లో కూడా ఇలాంటివి చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది’ అంటూ ఆమె పేర్కొంది. ఖుష్బూ ఇలాంటి ఘటనలపై గతంలో కూడా చాలా సార్లు స్పందించారు. సొసైటీలో జరిగే విషయాలపై ఆమె ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు.