Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో గుడిలో సీన్ ను స్పూఫ్ చేయగా.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీశారంటూ రవి, సుధీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. ఇదే టైమ్ లో రవికి సంబంధించిన ఆ ఆడియో లీక్ అయింది. అందులో తాను తప్పు చేయలేదని.. తాను ఇండియన్ అని రవి అన్నాడు. ఇది వైరల్ అయిన కొద్ది సేపటికే రవి నేరుగా వీడియో ద్వారా స్పందించాడు.
Read Also : GVMC: గ్రేటర్ విశాఖలో వైసీపీకి ఊహించని షాక్..!
‘మేం కావాలని ఆ వీడియో చేయలేదు. అది స్క్రిప్ట్ కూడా కాదు. సినిమాలోని సీన్ ను స్పూఫ్ గా చేశాం. అంతే. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చేయలేదు. కానీ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మేం తప్పు చేశాం. ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగదు. క్షమించండి. జై శ్రీరాం’ అంటూ అందులో తెలిపాడు. రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి సారీ చెప్పాడు.. మరి సుధీర్ ఎప్పుడు చెబుతాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదంపై సుధీర్ ఇంకా స్పందించలేదు.