The Kerala Story: ది కేరళ స్టోరీ తో తమిళనాడును షేక్ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థత గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ సక్సెస్ మీట్ ల కోసం ఊర్లు తిరుగుతున్న విషయం తెల్సిందే. ఇక వరుస ప్రయాణాల వలన ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదన ఆయన సన్నహితులు చెప్పుకొస్తున్నారు. ఇక కేరళ స్టోరీ విషయానికొస్తే.. అదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దేశం మొత్తాన్ని గడగడలాడించింది.
Balagam: అట్లుంటుంది ‘బలగం’ తోని.. కాకి ముట్టలేదని ఆ పని చేసిన కుటుంబం
కేరళలోని 32 వేలమంది యువతులను మతం మార్పించి తీవ్రవాదులుగా ఎలా చేశారు అనేది ఈ సినిమాలో చూపించాడు సుదీప్తో. ఇక రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈసినిమా వివాదాలతోనే నడుస్తోంది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలనీ తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రయత్నించినా వారివలన కాలేదు. దీంతో తమిళనాడులో ఈసినిమాను చూసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా పోలీసులను లెక్కచేయకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. భారీ విజయంతో పాటు భారీ కలక్షన్స్ కూడా రాబట్టి రికార్డులను బద్దలుకొడుతోంది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా కలక్షన్స్ ను సాధించి ది కేరళ స్టోరీ రికార్డ్ ను బద్దలుకొట్టింది. ఇక సుదీప్తో సేన్ ఆరోగ్యం బావుండాలని ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.