Balagam: సినిమాల వలన జీవితాలు మారతాయా..? అంటే చాలామంది చాలారకాలుగా చెప్తారు. సమాజాన్ని మార్చలేం కానీ, అందులో ఒక్కరైనా మా సినిమా చూసి మారితే సంతోషమని మేకర్స్ అంటారు. సినిమాను సినిమాలాగా చూడాలి అని అంటారు మరికొంతమంది. ఇక ఇవన్నీ కాదు.. మాకు ఏది నచ్చితే అది తీసుకుంటాం అనేటోళ్లు కూడా లేకపోలేదు. ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. ఒక సినిమా.., కొన్ని కుటుంబాలను మార్చేసింది. ఆ సినిమానే బలగం. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూసాకా.. విడిపోయిన అన్నదమ్ములు కలిసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఊరు.. ఊరు మొత్తం ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్న ఘటనలు జరిగాయి. పెద్దవారు చనిపోయాకా పిట్టకు పెట్టే ఆనవాయితీ ప్రతి తెలుగు కుటుంబంలో ఉంటుంది. ఇక తాజాగా ఒక కుటుంబం..బలగం సినిమాలో కనుక కాకి అన్నం ముట్టకపోతే ఇష్టమైనవి పెట్టినట్లు.. వీరు కూడా తండ్రి చనిపోయాక కాకి అన్నం ముట్టకపోవడంతో తన తండ్రికి నచ్చినవి పెట్టి చూపరులను ఆకర్షించారు. ఇక ఆ తండ్రికి నచ్చినవి ఏంటో తెలుసా.. పేక ముక్కలు.
Pawan Kalyan: ఆయనను మర్చిపోలేం.. పవన్ ఎమోషనల్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో పూదరి వెంకటరాజ్యం గౌడ్ అనే
80 ఏళ్ల వృద్దుడు ఐదురోజుల క్రితం మరణించాడు. అతనికి ముగ్గురు కొడుకులు.. వెంకటరాజు గౌడ్ 50 సంవత్సరాలుగా చుట్టూ ఉన్న ఏడు గ్రామాలకు గ్రామపెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఇక అతను చనిపోయి 5 రోజులు కావస్తుండడంతో కుటుంబ సభ్యులు పిట్టకు పెట్టే కార్యక్రమం చేశారు. ఆయనకు ఇష్టమైన వంటకాలను చేసి.. కుటుంబం మొత్తం కాకి కోసమా ఎదురుచూశారు. కానీ, కాకి రాలేదు. ఇక అప్పుడే వీరికి బలగం సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో కనుక తాతకు నచ్చిన ఫోటో పెట్టి కుటుంబం మొత్తం వచ్చి నిలబడగానే కాకి అన్నం తిని వెళ్తోంది. అదే విధంగా వెంకటరాజు గౌడ్ కు నచ్చింది అక్కడ పెడితే కాకి అన్నం ముట్టిద్దేమో అని ఆలోచించి.. ఆలోచించి.. వెంకటరాజు గౌడ్ కు ఇష్టమైన పేక ముక్కలను తీసుకొచ్చి పళ్లెంలో పెట్టారు. అయినా కాకి ముట్టలేదు. ఇక ఈరోజు.. వెంకటరాజు గౌడ్ కు ఇష్టమైన వంటకాలతో పాటు పేక ముక్కలను, పది రూపాయల నోటును పళ్లెంలో పెట్టి వచ్చారు. తన తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటు పేక ముక్కలు పెట్టడంతో తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఏదిఏమైనా ఒక సినిమా వీరి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.