Keerthy Suresh : కీర్తి సురేష్ మలయాళ బ్యూటీ అయినా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఏకంగా తెలుగు పద్యం తడబడకుండా చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది తెలుగు యాక్టర్లకు కూడా ఇది సాధ్యం కాదేమో. కీర్తి సురేష్, సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. ఐవీ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4 నుంచి అమేజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ మాట్లాడింది.
Read Also : Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..
సినిమా గురించి చెబుతూ.. ‘ఉప్పుకప్పు రంబు నొక్కపోలికనుండు.. చూడ చూడ రుచులు జాడవేరయా.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా’ అని పద్యం చెప్పేసింది. ఈ పద్యం లాగే తమ సినిమా ఉంటుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
ఓ ఊరిలో వింత సమస్యలతో జనాలు చనిపోతుంటారు. చివరు వారిని పూడ్చిపెట్టడానికి స్థలం కూడా దొరకదు. ఆ ఊరికి వచ్చిన లేడీ ఆఫీసర్ (కీర్తి సురేష్), కాటికాపరి (సుహాస్) కలిసి ఆ ఊరి సమస్యను ఎలా పరిష్కరించారు అనేది మూవీ కథ. ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మూవీ మంచి ఆసక్తి రేపుతోంది. మరి కీర్తి, సుహాస్ జంట ఎలా అలరిస్తుందో చూడాలి.
Read Also : Rashmika : ‘రష్మిక సెంటిమెంట్’ కుబేరకు కలిసొస్తుందా..?