Keerthy Suresh : టాలీవుడ్ లో క్రేజీ కాంబోలు కొన్ని సెట్ అయితే చూడాలని వారి ఫ్యాన్స్ అనుకుంటారు. అలాంటి క్రేజీ కాంబోలో విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ కచ్చితంగా ఉంటారు. ఇద్దరూ ట్యాలెంటెడ్ యాక్టర్సే. పైగా ఇద్దరికీ మంచి స్టార్ డమ్ ఉంది. కానీ వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ-రవికిరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. దాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. తాజాగా దానిపై కీర్తి సురేష్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.
Read Also : Kubera : కుబేర బడ్జెట్ ఎంత.. గట్టెక్కుతుందా..?
కీర్తిసురేష్-సుహాస్ కాంబోలో వస్తున్న మూవీ ఉప్పుకప్పురంబు. ఇది అమేజాన్ రెండో తెలుగు మూవీ. దీన్ని ఐవీ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా మూవీ రాబోతోంది. జులై 4న అమేజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ చాలా విషయాలను మీడియాతో పంచుకుంది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ మీరు విజయ్ దేవరకొండ మూవీలో నటిస్తున్నారా అని ప్రశ్నించాడు.
‘ఆ విషయం నిర్మాత దిల్ రాజు గారు చెప్తారు’ అంటూ నవ్వేసింది. అంటే ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసేసిందన్నమాట. ఒకవేళ నటించకపోతే లేదని డైరెక్ట్ గా చెప్పేసేది. కానీ నిర్మాత చెబుతాడు అని చెప్పిందంటే మాత్రం త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి వీరిద్దరి కాంబోలో మూవీ అంటే కచ్చితంగా వేరే లెవల్ లో ఉంటుందని టాక్ నడుస్తోంది.
Read Also : Rashmika : ‘రష్మిక సెంటిమెంట్’ కుబేరకు కలిసొస్తుందా..?