బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. 675 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడిన సలార్ సినిమాతో ప్రభాస్ ఫైనల్ గా 800 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో… వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ బడ్జట్ తో ప్రభాస్ కల్కి 2898AD సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా… దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. కల్కి 2898AD ఇండియాస్ నెక్స్ట్ బిగ్ థింగ్ లా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ ఉన్న కల్కి మూవీని రిలీజ్ టైమ్ కి వరల్డ్ వైడ్ బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ. అయితే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన కల్కి 2898AD మూవీ… వాయిదా పడి వెనక్కి వెళ్లింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898AD రిలీజ్ డేట్ విషయంపై చర్చ జరుగుతుంది. కల్కి రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు అనే మాట వినిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో కల్కి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి దారిలో నడుస్తుందనే వార్త బయటకి వచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ కి మే 9వ తేదికి దశాబ్దాల అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తుఫానుకి కూడా ఎదురు నిలిచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మోడరన్ క్లాసిక్ ‘మహానటి’ కూడా మే 9నే రిలీజ్ అయ్యింది. చివరగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో వైజయంతి మూవీ మే 9న హిట్ కొట్టింది. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్ గా మారాయి. ఈ సెంటిమెంట్ ని బిలీవ్ చేస్తూ 2024 మే 9న కల్కిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. మరి ఈ కల్కి జగదేక వీరుడిని, మహర్షిని, మహానటిని ఫాలో అవుతారో లేదో చూడాలి.