మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుంచి కాజల్ రోల్ తీసేశారని పలు రూమర్లు రాగా, ఇటీవలే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్ ను సినిమాలోకి తీసుకున్న విషయం నిజమేనని, కానీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక ఆమె పాత్ర సంతృప్తికరంగా అన్పించలేదని, నిజానికి చిరు పాత్రకు ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ లేదని, అందుకే కాజల్ రోల్ ను బలవంతగా చొప్పిస్తున్నట్టుగా అన్పించడంతో, ఆమె పాత్రను తొలగించమని వెల్లడించారు. ఇక ఈ నిర్ణయాన్ని కాజల్ కు చెప్పగా, ఆమె కూడా చిరునవ్వుతో పక్కకు తప్పుకుందని అన్నారు. కానీ కాజల్ సైలెన్స్ వెనుక రీజన్ వేరే ఉందంటున్నారు.
Read Also : Acharya Movie Twitter Review : టాక్ ఏంటంటే?
నిజానికి కాజల్ ఈ సినిమాలో నటించనప్పటికీ తన పారితోషికాన్ని పూర్తిగా తీసుకుందని టాక్ నడుస్తోంది. ‘ఆచార్య’ కోసం కాజల్ దాదాపుగా ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ అనుకుందట. కోటిన్నర తన ఖాతాలో వేసుకోవడంతోనే కాజల్ సైలెంట్ గా ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు అమ్మ అయ్యిందన్న విషయం తెలిసిందే. ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును కూడా పెట్టేశారు.