మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుంచి కాజల్ రోల్ తీసేశారని పలు రూమర్లు రాగా, ఇటీవలే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్ ను సినిమాలోకి తీసుకున్న విషయం…