హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో షాక్, ఠాగూర్, చంద్రముఖి, సినిమాలు తన నటనకు అద్దం పట్టాయి. ప్రజంట్ ఉన్న హీరోయిన్లలో ఆమె నటనను స్పుర్తిగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక సూర్యతో వివాహం తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న జ్యోతిక చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ఆకట్టుకునే అందం తో ఏమాత్రం తగ్గేదిలే అంటుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’ నెట్ ఫ్లెక్స్ లో ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిక తన కెరీర్ గురించి కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Rakul Preet Singh: తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రకుల్
జ్యోతిక మాట్లాడుతూ.. ‘ తమిళ్ లో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రం తర్వాత తమిళ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. అలా నా కెరీర్లో నేను చాలా మంచి పాత్రలు చేశాను. వాటిలో ‘మోజి’ సినిమా నాకు చాలా ఇష్టం. నేను మూగ చెవిటి అమ్మాయిగా నటించాను. నా కెరీర్ కు మైలురాయి లాంటిది ఈ సినిమా. అలాగే నేను న్యాయవాదిగా నటించిన సినిమా, ప్రిన్సిపల్ గా చేసిన చిత్రాలు కూడా ఇష్టం. ఇవి నా కెరీర్ లో ఐకానిక్ సినిమాలు. ఇప్పుడు రీసెంట్ గా చేసిన ఈ ‘డబ్బా కార్టెల్’ సిరీస్ ..ఇందులో ప్రతి అంశం నన్ను ఆకర్షించింది. ఈ సిరీస్ కంటెంటే కింగ్ షవానా అలాంటి గొప్పవారితో చేయడం మరింత ఆనందంగా ఉంది. ఆమె పక్కన నిలబడితేనే ఏదో తెలియని శక్తి ఉంటుంది’ అని తెలిపింది.
ఇక ఇంట్లో సూర్య మీరు ఫ్యామిలితో ఎలా ఉంటారు అని ప్రశ్న వేయడంతో.. ‘మేము మా స్టార్ డమ్ ను బయట వదిలేస్తాం. ఇంట్లోకి అడుగుపెట్టగానే మేం తల్లిదండ్రులమే. పిల్లలకు బాక్స్ లు ఇస్తాం. ప్రతి ఉదయం వారి ఆహారం గురించి ఆలోచిస్తాం. వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తాం’ అని తెలిపింది.