Elephants Attack: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి (మం) గుండాలకొన అటవీ ప్రాంతంలో భక్తుల బృందంపై ఏనుగుల దాడి… మహాశివరాత్రికి గుండాలకోన మీదుగా నడుచు కుంటూ తలకోనకు వెళుతున్న 14 మంది భక్తులకు తారసపడ్డాయి ఏనుగులు.. అయితే, భయంతో పరుగులు తీసిన భక్తులపై ఒక్కసారిగా ఏనుగులు దాడి చేశాయి.. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. అయితే, దినేష్ (30) చంగల్ రాయుడు (35) మన్నెమ్మ (35) అనే ముగ్గురు అక్కడికి అక్కడే మృతిచెందగా.. అమ్ములు (13),రాజా (29) తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు, మరో నలుగురు సురక్షితంగా బయటపడినట్టు చెబుతున్నారు.. సంఘటన స్థలానికి అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది చేరుకున్నాయి.. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత సహా పలువరు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Also: Maha Kumbh Mela: కుంభమేళాలో మరో రికార్డ్! చీపురుపట్టిన 15 వేల మంది కార్మికులు
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్..
Read Also: New Ration Cards: పదేళ్ల తర్వాత నెరవేరుతున్న పేదల కల.. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు!
ఇక, ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.. ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లకై ఆదేశించారు.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తరపున అండగా ఉంటామని వెల్లడించారు.. ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. ఈ దురదృష్టకర సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.. ఇదే దాడిలో మరికొందరు గాయపడడంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారుల్ని ఆదేశించాను.. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.