సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. అలాంటి వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథ్. కాలేజీ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్ బాయ్ టాలెంట్ నచ్చి జయం రవి ఆఫర్ ఇచ్చాడు. అదే కోమలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా ప్రదీప్ పేరు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యింది. కోమలి హిట్ తర్వాత తను కాలేజీ డేస్ లో షార్ట్ ఫిల్మ్ గా తెరకెక్కించిన వాట్సప్ కాదల్ ను లవ్ టుడేగా తీసుకు వచ్చాడు. హీరో కమ్ డైరెక్టరుగా బాధ్యతలు భుజాన వేసుకుని చేసిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరడంతో ప్రదీప్ పేరు మార్మోగిపోయింది. హీరోగా జూనియర్ ధనుష్ అంటూ మంచి మార్కులు పడటంతో కొత్త కథలు రావడం మొదలయ్యాయి.
Also Read : Janhvi Kapoor : సౌత్ పై ఫుల్ ఫోకస్ చేస్తోన్న జాన్వీ కపూర్
దీంతో డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చి వేరేవారికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ప్రెజెంట్ ఓ మై కడవలే ఫేం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్, విఘ్నేశ్ శివన్ తో లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ చేస్తున్నాడు. ఇప్పటికే కంప్టీటైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డ్రాగన్ ఫిబ్రవరి 21 థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనుపమ, కయాద్ లోహర్ హీరోయిన్లు. ఇందులో నయనతార గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు టాక్. సుమారు రూ. 37 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు అశ్వత్ వెల్లడించాడు. లవ్ టుడేతో వంద కోట్లు కొల్లగొట్టడంతో డ్రాగన్ విషయంలో కూడా ఈ టార్గెట్టే ఊరిస్తోంది. మరీ ఈ జూనియర్ ధనుష్ లవ్ టుడే కలెక్షన్లను క్రాస్ చేస్తాడా లేదా అనేది ఈ నెల 21 న తేలనుంది.