సౌత్ బెల్ట్ పై మనసు పారేసుకుంటోంది ఒకప్పటి అందాల తార శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవరతో సౌత్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. నటి శ్రీదేవి తనయగా ఆమెకు ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని క్రేజ్, ఒక్క దేవర తో సౌత్ లో వచ్చిన క్రేజ్, ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ చూసి ఫిదా అయ్యింది బ్యూటీ. అందుకే సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ చేస్తోంది.
Also Read : Chandoo Mondeti : చందు మొండేటి నెక్ట్స్ ఏంటి?
ధడక్ తో కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీ గుంజన్ సక్సేనా, గుడ్ లక్ చెరీ, మిలీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రాలతో నటన పరంగా ఓకే అనిపించుకుంది కానీ కమర్షియల్ హీరోయిన్ గా ఆమెను మార్చలేకపోయాయి. దేవర ఆ లోటు తీర్చడంతో తెలుగులో భారీ ఆఫర్ కొల్లగొట్టేసింది. బుచ్చిబాబు- చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలో కమిటయ్యింది. ప్రెజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, పరమ్ సుందరి చేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ నుండి కోలీవుడ్ పైకి ఫోకస్ పెడుతోంది జాన్వీ. తంగలాన్ తో విక్రమ్ ఖాతాలో ప్లాప్ వేసిన పా రంజిత్ తో వర్క్ చేయబోతుందని చెన్నై సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. అదీ కూడా వెబ్ సిరీస్ చేస్తుందని టాక్. నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట పా రంజిత్. దీనిపై జాన్వీ, పా రంజిత్ మధ్య చర్చలు నడిచాయని టాక్. మరి జాన్వీ టాలీవుడ్ లాగే కోలీవుడ్ లో కూడా సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి.