NTR: ఆస్కార్ వేడుక ముగిసింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్.. అనుకున్నట్టుగానే ఆస్కార్ ను ముద్దాడింది. ఇండియా పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేసిన చిత్ర బృందానికి ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికాలోనే ఆస్కార్ పార్టీ చేసుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఆ పార్టీలో లేకుండా నేడు ఉదయం హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకకు వెళ్లడమే ఆలస్యంగా వెళ్ళాడు. తన అన్న తారకరత్న దశదిన కార్యక్రమం ఉండడంతో ఆస్కార్ వేడుక మరో మూడు రోజులు ఉంది అనగా అమెరికా వెళ్లాడు. ఇక ఆస్కార్ అందుకున్న తరువాతి రోజే ఎన్టీఆర్ ఇండియాకు వచ్చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర బృందం మొత్తం తో కలిసి రాకుండా ఎన్టీఆర్ ఒక్కడే ఎందుకు ఇండియాకు వచ్చాడు అని గుసగుసలాడుతున్నారు. ఎన్టీఆర్ ఈరోజు ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఇక ఎన్టీఆర్ ఇంత త్వరగా రావడానికి కారణం.. తారక్.. విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడానికి అంగీకరించాడు. ఆ ఈవెంట్ మార్చి 17 న శిల్పకళావేదికలో జరగనుంది. ఇచ్చిన మాట తప్పకూడదని ఎన్టీఆర్..చిత్ర బృందంతో పాటు కాకుండా ముందే వచ్చేశాడు అని సమాచారం. ఇక ఎయిర్ పోర్టులో తారక్ మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కీరవాణి, చంద్ర బోస్ ఆస్కార్ స్టేజి మీదకు వెళ్లడం.. తనకు బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆస్కార్ అవార్డును పట్టుకున్నప్పుడు చాలా బరువుగా అనిపించిందని, మన దేశం ఎంత బరువుగా ఉందో అవార్డు కూడా అంతే బరువుగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.