Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎంతోమంది హీరోల పక్కన జాన్వీ పేరు నానుతూ వచ్చింది. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా అందరి పేర్ల తరువాత ఎట్టకేలకు ఎన్టీఆర్ తో చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక దీంతో జాన్వీపై ఎన్టీఆర్ అభిమానులు ఆమె ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ పక్కన కనిపిస్తుందో అని ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ 30 .. మార్చి 23 న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే జాన్వీ, ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.
Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ మాట్లాడుతూ.. ” నాకు మొదటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించాలని నాకెప్పుడూ ఆశగా ఉండేది. ఆయనతో నటించే అవకాశం రావాలని దేవుడ్ని రోజూ ప్రార్దించేదాన్ని. నా కల ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నా.. ఎన్టీఆర్ ను ఎప్పుడెప్పుడు కలుస్తానా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని డైరెక్టర్ కు రోజు మెసేజ్ లు చేస్తున్నా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు సార్లు చూసా.. ఎన్టీఆర్ అందం, ఎనర్జీ ఎంతో గొప్పగా ఉంటాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.