Vijay: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది. షారుఖ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమాగా జవాన్ నిలిచింది. తెలుగులో ఈ సినిమా అభిమానులకు నార్మల్ గా అనిపించినా.. నార్త్ లో మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ సినిమా అని అనిపించుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమా గురించి మాట్లాడని ఒక హీరో సైతం జవాన్ పై ప్రశంసలు కురిపించాడు. ఆ హీరో ఎవరు కాదు తలపతి విజయ్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఎక్కువ సోషల్ మీడియాలో ఉండడు. ఏ సినిమా గురించి కానీ, ఏ హీరో గురించి కానీ ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా చెప్పుకురాడు. కానీ, మొట్ట మొదటసారి జవాన్ సినిమాపై విజయ్ స్పందించాడు.
Eagle: మహేష్ వర్సెస్ రవితేజ.. ఈ సంక్రాంతి మరింత ఘాటుగా
షారుఖ్ ఖాన్.. జవాన్ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ట్విట్టర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నట్లు పోస్ట్లు పెట్టిన వారందరికీ ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ ఫ్యాన్స్.. జవాన్ సినిమా వెయ్యి కోట్లు సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు. ఇక దీనికి షారుఖ్ రిప్లై ఇస్తూ ..” మీ విషెస్ కు థాంక్యూ.. తలపతి తదుపరి సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాన.. లవ్ విజయ్ సర్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు విజయ్ రిప్లై ఇస్తూ ” బ్లాక్ బస్టర్ సాధించినందుకు అభినందనలు అట్లీ, షారుఖ్ ఖాన్ సర్.. మరియు చిత్ర బృందానికి .. లవ్ యు టూ షారుఖ్ సర్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Congratulations on the blockbuster @iamsrk, @Atlee_dir and the entire #Jawan team!
Love you too @iamsrk sir https://t.co/yq5T2BOhz8
— Vijay (@actorvijay) September 27, 2023