శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’. దర్శకుడు అజయ్ భూపతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహా సముద్రం’ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దూకుడుగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జగడాలే రాని’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కన్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సౌండ్‌ట్రాక్ ఫ్రెండ్స్ కోసమే. తమను తాము ‘రెబెల్స్’ అని పిలుచుకుంటూ యంగ్ హీరోలిద్దరూ కొంతమందిని వెంబడించి వారిని కొట్టినట్లు కొట్టినట్లు కన్పిస్తోంది. ఎవరికీ నచ్చినట్టుగా వారు ఉండాలని ఈ సాంగ్ ద్వారా సూచిస్తున్నారు.
Read Also : సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
ఈ ప్రోమోను చూస్తుంటే అజయ్ భూపతి చెప్పినట్లుగా ఇద్దరు మంచి స్నేహితులను తెరపై చూస్తాము అన్పిస్తోంది. భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. చైతన్, హేమచంద్ర వాయిస్ ఇచ్చారు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘మహా సముద్రం’ రేపు విడుదల కానుంది.