శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’. దర్శకుడు అజయ్ భూపతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహా సముద్రం’ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దూకుడుగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జగడాలే రాని’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కన్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సౌండ్‌ట్రాక్ ఫ్రెండ్స్ కోసమే. తమను తాము ‘రెబెల్స్’ అని పిలుచుకుంటూ…
“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్…