Jabardasth Venu: జబర్దస్త్ నటుడు వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు వేణుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. బలగం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన చిత్రం బలగం. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కుటుంబం బంధాలు.. అనుబంధాల మధ్య నలిగిపోయే మనుషులు, వారి మనస్తత్వాలు రియలిస్టిక్ గా చూపించాడు. ట్రైలర్ ను బట్టి వేణు.. డైరెక్టర్ గా మంచి ప్రయత్నమే చేసినట్లు కనిపించాడు. ఇక ప్రియదర్శికి ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. మల్లేశం, లూజర్ లాంటి సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ఒక పల్లెటూరి యువకుడిలా అతని నటన సినిమాకు హైలైట్ గా నిలిచిద్దని చెప్పుకోవచ్చు.
Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
ఇక ఈ సినిమా విషయంలో దిల్ రాజు తప్పు చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. దిల్ రాజు ఏదైనా సినిమాను పెట్టుకొంటే అది హిట్ అయ్యేవరకు వదిలి పెట్టడు. అలాంటిది ఆయనే నిర్మించిన సినిమా అంటే ఎంత పబ్లిసిటీ, ఎంత ప్రమోషన్స్.. పోతే ఈ సినిమా రిలీజ్ విషయంలోనే హార్ట్ కింగ్ తప్పటడుగు వేశాడా..? అని అంటున్నారు. ఎందుకంటే.. ఈఫిబ్రవరి చివరి వారంలో ఒక్క సినిమా రిలీజ్ కు లేదు.. అంతకు ముందు వరం వినరో భాగ్యం విష్ణు కథ, సార్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మధ్యలో ఇంకోవారం ఖాళీగా ఉంది . ఈ సినిమా కనుక గత శుక్రవారం థియేటర్ లో పడితే.. కొద్దోగొప్పో టాక్ మంచిగా నడిచేది కదా.. ఈ వారం లాకొచ్చినా కలక్షన్స్ అయినా అందుకొనేవారు. కానీ, దిల్ రాజు ఆలా చేయకుండా మార్చిలో రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే అసలు బజ్ లేని ఈ సినిమా వచ్చేనెల ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.