యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కమర్షియల్ సినిమాలకి కొత్త ఒరవడి నేర్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈ ఇద్దరి మధ్య కుస్తీ పోటీలని, అంతక ముందు జాతర సెటప్ లోని కొన్ని సీన్స్ ని షూట్ చేశారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ భైరవుడు అనే పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ‘దేవర’గా కనిపించనున్నాడు.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఫర్గాటెన్ లాండ్స్ లో, క్రూర మృగాలకి కూడా భయపడని మనుషులు ఉంటారు. జాలి అనేదే లేని ఆ మృగాల్లాంటి మనుషులని భయపెట్టేది ఒకరే, అతనే నా అన్న ఎన్టీఆర్ అంటూ కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ అనౌన్స్మెంట్ రోజునే అంచనాలు పెంచేసాడు. సరిగ్గా ఏడాది తర్వాత వచ్చే ఏప్రిల్ నెలలో 5వ తారీఖున ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీతో ఎన్టీఆర్, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి. ఇప్పటివరకైతే కొరటాల శివ తెరకెక్కించిన రెండు షెడ్యూల్ లో ఎక్కువ శాతం యాక్షన్ ఎపిసోడ్స్ ని మాత్రమే షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరుగుతుంది అనే మాట వినిపిస్తుంది కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈరోజుతో రామోజీ ఫిల్మ్ సిటీలో కుస్తీ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసి, కొంచెం గ్యాప్ తర్వాత మూడో షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యడానికి కొరటాల శివ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.