Intimate Scenes Hurted My Parents deeply Says Tripti Dimri: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా మొత్తం మీద జోయా అనే పాత్రలో నటించిన తృప్తి డిమ్రీ మాత్రం సూపర్ హైలైట్ అయింది. ఇక అంతకు ముందే ఆమె పలు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు ఈ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు ఆమె ఇన్స్టాగ్రామ్ లో సుమారు 600K ఫాలోవర్లను కలిగి ఉండగా ఇప్పుడు, ఆమెకు 3.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక ఈ సినిమాలో తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
SVCC 37: సిద్ధూ- భాస్కర్ మొదలెట్టేశారు!
ఇక తాజాగా తృప్తి డిమ్రీ యానిమల్‌లోని తాను నటించిన ఇంటిమేట్ సీన్స్ విషయంలో తన తల్లిదండ్రులు ఎలా స్పందించారో ఆమె వెల్లడించింది. “ ఆ ఇంటిమేట్ సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు బాధపడ్డారు, నేను అలాంటి పని చేస్తానని వారు ఊహించలేదు, ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాలు చూడలేదని వారు చెప్పారు. నేను అలాంటి సన్నివేశాలు చేయకూడదని వారు అభిప్రాయపడ్డారు, అలాంటి సన్నివేశాలలో నన్ను తెరపై చూసినప్పుడు వారు బాధపడ్డారని చెప్పారు’’ ఈ మేరకు తృప్తి తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఇలాంటి సన్నివేశాలు తన వృత్తిలో భాగమని, తానేమీ తప్పు చేయలేదని చెప్పి తల్లిదండ్రులను శాంతింపజేశానని తృప్తి డిమ్రీ పేర్కొంది. తన పాత్ర – సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల కలిగిన కల్చరల్ షాక్‌తో తన తల్లితండ్రులు ఇంకా తేరుకోలేదని తృప్తి డిమ్రీ వెల్లడించింది.