SVCC 37: సిద్ధూ- భాస్కర్ మొదలెట్టేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddhu Jonnalagadda, Bommarillu Bhaskar and BVSN Prasad’s SVCC37 shoot begins: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో రాబోతోన్న ‘ఎస్వీసీసీ 37’ షూట్ ప్రారంభం కానుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ మల్టీ టాలెంటెడ్ అని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఒక పక్క హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఆయన డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిద్ధూ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న క్రమంలో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని క్రమంలో వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు ముగ్గురూ కనిపిస్తున్నారు. నిజానికి చివరిగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు ముందు నుంచి చెబుతున్నారు. ఇక ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!