విజయవాడ నగరంలో రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్. అనంతరం బందర్ రోడ్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ ‘ఈనెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించాము. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతం అయ్యింది. రాబిన్ హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను త్వరలో కలవనున్నాను’ అని అన్నారు.
Also Read : SK : శివకార్తికేయన్ ‘పరాశక్తి’ లో మరొక స్టార్ హీరో..?
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడుగా మారాను. తాను దర్శకత్వం వహించిన ఛలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేశారు. నితిన్ తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో
క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.త్వరలో పుష్ప త్రీ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాము’ అని అన్నారు.