అమరన్‌తో రూ. 300 క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఆ వెంటనే సుధా కొంగరతో పరాశక్తి సినిమాను పట్టాలెక్కించాడు. సూ సూరారై పొట్రుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పొగొట్టుకున్నట్లయ్యింది. దీంతో అర్జెంట్‌గా ఆమెకు హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది.
Also Read : Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?
అలాగే ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో జయం రవి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. మరో యంగ్ హీరో అధ్వర్య కీ రోల్ ప్లే చేస్తున్నాడు. శివకార్తీకేయన్ 25వ సినిమాగా వస్తోంది పరాశక్తి. 1965లో జరిగిన యాంటీ హిందీ అల్లర్లుకు వ్యతిరేకంగా సినిమా రూపు దిద్దుకోబోతున్నట్లు ఓ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు డబుల్ చేస్తోంది. అలాగే ఈ కాస్టింగ్ కూడా క్యూరియోస్ కలిగిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ఫిల్మ్ మేకర్ మరో యంగ్ యాక్టర్‌ను రంగంలోకి దింపుతోందని టాక్. పరాశక్తి ప్రాజెక్టులో మరో స్టార్ట్ కాస్ట్ జాయిన్ అవుతున్నట్లు ఓ న్యూస్ సర్య్కులేట్ అవుతుంది. మాలీవుడ్ యంగ్ సెన్సేషన్ బాసిల్ జోసెఫ్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సెట్స్‌లో ఉన్న కొన్ని పిక్స్ కూడా లీక్ కావడంతో బాసిల్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే టాక్సిక్ తో కన్నడతో పాటు పాన్ వరల్డ్ లెవల్లో ఇంట్రడ్యూస్ అవుతున్న బాసిల్ పరాశక్తిలో యాక్ట్ చేయడం కన్ఫమ్ అయితే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలను సెట్ చేసుకున్నట్లే.