Chiranjeevi Charitable trust Star Hospitals free cancer screening camp: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు సహా సామాన్య ప్రజానీకం కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంకులో నిర్వహించారు. హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ కార్మికులు, పలువురు నటులు, సహా సినీ జర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, ప్రఖ్యాత స్టార్ హాస్పిటల్ భాగస్వామ్యంతో వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తామని ముందు ప్రకటించినా మొదటి రోజు 2000 మందికి పైగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఇంతకుముందే చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం జూలై 9న హైదరాబాద్ లో దిగ్విజయం అయింది. ఇక తదుపరి జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాలు జరుగుననున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
Salmankhan :సిగరెట్ కాల్చుతూ.. స్టేజ్ పైకి వచ్చిన సల్మాన్ ఖాన్..నెటిజన్స్ ఫైర్..
ఇక ఈ కార్యక్రమానికి హాజరైన మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి గాని, తనకు గాని కళ్యాణ్ బాబుకి కానీ డాక్టర్లు అంటే చాలా గౌరవమని ఆయన అన్నారు. గోపీచంద్ గారు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మా అన్నయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లడ్ బ్యాంకులో చేయడం మాకు గర్వకారణమని పేర్కొన్న నాగబాబు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారని రిజిస్టర్ చేసుకోని వారు కూడా చాలా మంది వస్తున్నారని అన్నారు. ముందుగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే అవకాశం లేకుండా ఉంటుందని చెబుతూ డాక్టర్ గోపీచంద్ గారికి ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ టీంకి హ్యాట్సాఫ్ చెప్పారు. స్టార్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యుల స్పెషలిస్ట్ టీం మీ ఊర్లకే వస్తున్నారు, మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా సరదాగా వచ్చి టెస్ట్ చేయించుకోండి అని నాగబాబు కోరారు. అయితే అందరికీ ఈ టెస్టుల్లో నెగిటివ్ రావాలని డాక్టర్లకు పని తక్కువ కల్పించాలని ఆయన కామెంట్ చేశారు.