Salmankhan :సిగరెట్ కాల్చుతూ.. స్టేజ్ పైకి వచ్చిన సల్మాన్ ఖాన్..నెటిజన్స్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇటు సినిమాలతో పాటు.. అటు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ వస్తున్నాడు.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది..ఆయన ఎంత బిజీగా ఉంటున్నాడో.. అంతకురెట్టింపు వివాదాలు కూడా పోగేసుకుంటున్నాడు.. సల్మాన్ పై ఏడాదికి రెండు మూడు వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఉగ్రవాదుల ముప్పుతో ఇబ్బందిపడుతున్నాడు. సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తాం అని లారెన్స్ బిష్గోయ్ గ్యాంగ్ పంతం పూని తిరుగుతున్నారు. దాంతో సల్మాన్ ప్రస్తుతం వై క్యాటగిరీ భద్రత నడుమ తిరుగుతున్నాడు. తనకు తాను ప్రైవేట్ గా ఇంకాస్త సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు..
ఇలా ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకు పర్మినెంట్ హోస్ట్ అన్న సంగతి తెలిసిందే.. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి నెటిజెన్స్ నుంచి ఏదో విషయంలో తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది. జైద్ హదీద్ తన తోటి కంటెస్టెంట్ ఆకాంక్ష పూరితో అసభ్యకరంగా ప్రవర్తించడం వివాదం అయితే, ఆ తరువాత వారిద్దరి లిప్ కిస్ చేసుకోవడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది…
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఇప్పుడు మరోసారి అడ్డంగా బుక్కయి నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు..ఈ శనివారం (జులై 8) కంటెస్టెంట్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్.. హౌస్ లో ఉన్నవారి తప్పొప్పులను చూపించి కౌంటర్స్ ఇచ్చాడు. అయితే ఇదే సమయంలో సల్మాన్ చేతిలో సిగరెట్‌తో కనిపించాడు. మర్చిపోయి అలా వచ్చేశాడా.. లేకు కావాలని ఇలాచేశాడా తెలియదు కాని.. రియాల్టీ షోలో ఆయన సిగరెట్ తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఒక సెలబ్రిటీ స్టేజిలో ఉన్న వ్యక్తే ఇలా పబ్లిక్ గా సిగరెట్ కాల్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు.. మొత్తానికి దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది.. మరి సల్మాన్, షో నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!