శ్రీ లీల.. కెరీర్ బిగినింగ్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ తీరిక లేని రోజులు గడిపింది. అలా మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వచ్చిన ఈ చిన్నది అంతే బిజాస్టర్‌లు కూడా చవిచూసింది. చివరగా మహేశ్ సరసన ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్ని, ఇటీవల ‘పుష్ప 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల. ఇక త్వరలో ‘రాబిన్ హుడ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈనెల 28న విడుదల కాబోతోంది. ఇక ప్రజంట్ నితిన్ శ్రీలీల పరిస్థితి ఒకటే.
Also Read: Rashmika : నా కల ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు
ఎందుకంటే గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఒకవైపు నితిన్ మరోవైపు శ్రీ లీల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యం. అందుకే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల రష్మిక గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
అయితే ‘రాబిన్ హుడ్’ లో ముందు హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారు కానీ డేట్స్ కుదరక ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఇక పుష్ప 2 స్పెషల్ సాంగ్ షూట్ లో రష్మికను చూసిన శ్రీలీల తనతో మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. ఇంతలోనే ‘స్వయంగా రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నా’ అని తెలపిందట. దీంతో రష్మిక అలా చెప్పిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారట. ‘రాబిన్ హుడ్’ లో తన క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది తెలిపింది శ్రీ లీల.