HaromHara: యంగ్ హీరో సుధీర్ బాబు గత కొన్నాళ్ల నుంచి భారీ హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడే కానీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటున్నా.. కూడా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. అయినా కూడా నిరాశ చెందకుండా సుధీర్ బాబు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హరోంహర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. సుధీర్ సరసన మాళవిక శర్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Thandel: ‘తండేల్’ అంటే అర్ధం ఏంటో తెలుసా.. ?
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. అందరు స్టార్ హీరోలను సుధీర్ బాబు వాడేస్తున్నాడు. నవంబర్ 27న ఈ సినిమా టీజర్ను కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళం లో మమ్ముట్టి.. తమిళ్ లో విజయ్ సేతుపతి రిలీజ్ చేస్తుండగా.. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ది పవర్ ఆఫ్ సుబ్రమణ్యం అనే థీమ్ వీడియో టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్రభాస్ వస్తున్నాడు అంటూ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఈ స్టార్ హీరోలు టీజర్ రిలీజ్ చేస్తున్నారు అని తెలియడంతో అభిమానులు ఈ టీజర్ పై కొద్దిగా ఆసక్తి చూపిస్తున్నారు. టీజర్ కనుక బాగుంటే సినిమాపై మరింత హైప్ వస్తుందని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను ఈ రేంజ్ ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు వాడుతున్నాడు అంటే సినిమాలో ఎంతో కొంత కథ ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. మరి సుధీర్ బాబు అభిమానుల నమ్మకాన్ని నిలబెడతాడా.. ? ఈ సినిమాతో సుధీర్ బాబు ఈసారైనా హిట్ అందుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.