హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే నాకు ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న టైమ్ లో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ, కథనం థ్రిల్లింగ్ గా అనిపించాయి. 105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఎంత కష్టమో ఓ సాంకేతిక నిపుణుడిగా నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో కొత్త తరం ఇలాంటి ఆలోచనతో సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. ఇలాంటి రిస్కీ చిత్రాన్ని నిర్మించటానికి చాలా గట్స్ ఉండాలి. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మించారు. సామ్ సి.యస్ సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.