Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు అయోమయంలో పడిపోతున్నారు. ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తికాలేదు.. మహేష్ ఒకపక్క వెకేషన్స్ అంటూ తిరుగుతున్నాడు.. ఇంకోపక్క సినిమా నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి వచ్చి చేరింది. డిఓపి మారిపోయాడు. అసలు సినిమా షెడ్యూల్ ఎప్పుడు మొదలుకానుందో తెలియడం లేదు. దీంతో సినిమా అసలు ఉంటుందా..? లేదా.. ? అనేది కూడా తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Ustaad Trailer: మనుషుల కంటే మెషీన్స్ ను నమ్ము.. అవి మోసం చేయవు
అదేంటంటే.. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ కు ముహూర్తం ఖరారు అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 9 న ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు. ఇక ఈ విషయం తెలియడంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదిఏమైనా ఒకపక్క గొడవలు జరుగుతున్నా.. ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.