Ustaad Trailer: మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహా. కీరవాణి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీసింహా, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఫణిదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉస్తాద్. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సూర్య అనే కుర్రాడి జీవితకథనే ఉస్తాద్. ఆ కుర్రాడి కాలేజ్ లైఫ్ నుంచి ఫైలెట్ అయ్యేవరకు అతను పడిన కష్టాలు ఏంటి అనేది చూపించారు.
Vishwak Sen: ‘బేబీ’ సినిమాకు నేను నో చెప్పలేదు.. విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు
సూర్యకు కోపం ఎక్కువ. అతని వద్ద ఎలాంటి వస్తువు ఎక్కువ రోజులు ఉండదు. అతని దగ్గర రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఉంటుంది. ఆ బైక్ మీదనే తన కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో పడతాడు. అయితే అతని కోపం చూసి అందరూ ఎగతాళి చేస్తారు. ఫైలెట్ అయ్యి మనుషుల ప్రాణాలు తీస్తావా అంటూ గేలి చేస్తారు. దీంతో సూర్య ఎంతో కష్టపడి ఫైలెట్ గా మారడమే కాకుండా.. మొదటి ట్రిప్ నే సీనియర్ ఫైలెట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో చేసే అవకాశం అందుకుంటాడు. అసలు సూర్యకు వస్తువుల మీద ఎందుకు అంత కోపం.. సూర్య ప్రేమించిన అమ్మాయి ఎవరు.. ? చివరికి సూర్య ఉస్తాద్ లా ఎలా మారాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అకీవా బి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి సినిమా హిట్ అందుకొనే ఛాన్స్ లు ఉన్నాయని అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో నైనా శ్రీసింహా హిట్ అందుకుంటాడేమో చూడాలంటే ఆగస్టు 12 వరకు ఆగాల్సిందే.