Gunasekhar indirect Comments on Rana Trivikram’s Hiranyakashyap: కొన్నాళ్ల క్రితం రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప అనే ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అటు రానాతో పాటు గుణశేఖర్ సైతం పలు సందర్భాల్లో ధ్రువీకరించారు కూడా. అయితే అనూహ్యంగా ఇప్పుడు రానా -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ హిరణ్యకశిప అనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరికీ సుపరిచితమైన అమరచిత్ర కథ అనే కామిక్స్ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇక రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కథ అందిస్తున్నారనే విషయం మీద క్లారిటీ వచ్చింది కానీ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనే విషయం మీద అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ కౌంటర్ ఇచ్చారు.
Janhvi Kapoor: జాన్వీ జిగేల్.. కుర్రాళ్ళ గుండెలు గుభేల్
ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ తాలూకాలో ఉన్న అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోతో పాటు అక్కడ తాను కూడా ఉన్న ఫోటో షేర్ చేసిన గుణశేఖర్ దేవుడిని సెంట్రల్ థీమ్ గా పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మీ ఇంటిగ్రిటీ మీద దేవుడు కూడా ఒక కన్నేసి ఉంచుతాడని గుర్తుపెట్టుకోండి, అధర్మంగా చేసిన అన్ని పనులకు ధర్మంగానే సమాధానం దొరుకుతుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. బహుశా ఇది తాజాగా వచ్చిన రానా హిరణ్యకశిప ప్రాజెక్టు అధికారిక ప్రకటన గురించే అనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి శాకుంతలం ప్రమోషన్స్ సమయంలోనే గుణశేఖర్ ఈ విషయం మీద ఇండైరెక్టుగా హింట్ ఇచ్చారు. తాను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు మీరు చేయలేకపోతే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్ళతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదని ఒకవేళ తనకు అన్యాయం జరిగితే ఏమాత్రం వదిలే ప్రసక్తే లేదని ఎంతవరకైనా వెళ్తానని అది ఎవరైనా సరే అంటూ అప్పుడు ఆయన కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతానికి అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం మీద త్రివిక్రమ్ టీమ్ నుంచి గాని రానా టీం నుంచి గాని ఏదైనా క్లారిఫికేషన్ వస్తుంది ఏమో చూడాలి.