JR NTR : జూనియర్ ఎన్టీఆర్ కు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లో ఎన్టీఆర్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. త్రిబుల్ ఆర్, దేవర సినిమాలతో అక్కడ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. దేవర సినిమాను స్పెషల్ గా అక్కడ రిలీజ్ చేశారు. ఆ టైమ్ లో ఓ అభిమాని ఎన్టీఆర్ కోసం ఏకంగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది. ఆ వీడియోను ఎన్టీఆర్ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఓ మహిళా అభిమాని జపాన్ నుంచి ఇండియాకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేసి షేర్ చేసేస్తున్నారు.
Read Also : Fauji : ప్రభాస్ లుక్ షేర్ చేస్తే జైలుకే.. ఫౌజీ టీమ్ వార్నింగ్
తాజాగా క్రిసో అనే అమ్మాయి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆమె టీ షర్టు మీద ఎన్టీఆర్ ఫొటో ఉంది. తాను వార్-2 సినిమా చూసేందుకు ఇండియాకు వచ్చినట్టు తెలిపింది. తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని అని.. గతంలోనూ ఎన్టీఆర్ సినిమాలు చూసేందుకు ఇండియాకు వచ్చినట్టు తెలిపింది. మళ్లీ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు ఇండియాకు వస్తానని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఎన్టీఆర్ అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన్ను అన్ని దేశాల వారు ప్రేమిస్తారంటూ చెబుతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వచ్చిన వార్-2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు.
Read Also : JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..