ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నైజాంలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ నైజాం ఏరియాలో కోట్లు కురిపిస్తూ ఉంటాడు. ఈ నైజాం గడ్డ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మరోసారి చూపించే సంఘటన ఒకటి జరిగింది. అల్లు అర్జున్, తన మామ బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్ కి నల్గొండ వచ్చాడు. కంచర్ల కన్వేషన్ సెంటర్ ఓపెనింగ్ కి వచ్చిన అల్లు అర్జున్ కి నల్గొండ బ్రహ్మరథం పట్టింది. దాదాపు పది వేల మంది అభిమానులు అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ సంబరాలు చేసారు. గజ మాల వేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Read Also: Sreeleela: ప్రతి పండగ ఈ పాపదే… నెలకోసారి వస్తుంది
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన హంగామాకి సంబంధించిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ ట్యాగ్ ట్విట్టర్ టాప్ ట్రెండ్ లో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తను వచ్చే ఎన్నికల్లో నిలబడితే అల్లు అర్జున్ తన కోసం పోటీ చేయడానికి వస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్ కి వచ్చి అల్లు అర్జున్, ఆ మాటని నిజం చేసి చూపించాడు. సొంత మామకి వ్యాపారంలోనే అండగా నిలవడానికి వచ్చిన అల్లు అర్జున్, రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్ చేయకుండా ఉండడు.