టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదేమో. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది ఈ యంగ్ బ్యూటీ. అసలు ఇన్ని సినిమాలను ఎలా మ్యానేజ్ చేస్తుందో శ్రీలీలకే తెలియాలి. మామూలుగా చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే… వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. నెలకో సినిమా చొప్పున ఐదు నెలల్లో ఐదు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది శ్రీలీల. ముందుగా సెప్టెంబర్ 15న రామ్, బోయపాటి ‘స్కంద’ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్‌లో దుమ్ముదులిపేసింది శ్రీలీల.
ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించిన ‘ఆదికేశవ’ నవంబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఇక డిసెంబర్ 23న నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్లో వస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్టిడినరీ మేన్’తో పలకరించనుంది శ్రీలీల. ఇక 2024లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వనుంది అమ్మడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో శ్రీలీల టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి వెళ్లిపోవడం ఖాయం. ఇక ఆ తర్వాత సమ్మర్‌లో పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి… నెక్స్ట్ ఇయర్ కూడా శ్రీలీలదే హవా అని చెప్పొచ్చు. ఏదేమైనా ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది శ్రీలీల.