హాలీవుడ్ స్టార్ హీరో ఎజ్రా మిల్లర్ ను రెండవ సారి అరెస్టు చేశారు పోలీసులు. నిజానికి ఎజ్రా మిల్లర్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ‘జస్టిస్ లీగ్’లో ‘ది ఫ్లాష్’ అంటే టక్కున గుర్తు పడతారు ఎవరైనా. ఇక ఈ హీరో ఇటీవలే “ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్” సినిమాలో నెగెటివ్ రోల్ లో కన్పించి, ప్రపంచవ్యాప్తంగా మరింత పేరు సంపాదించుకున్నాడు. అయితే హవాయిలో ఎజ్రాను మంగళవారం ఉదయం 1.30 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ కు కారణం ఏమిటంటే… పహోవాలోని ఒక ప్రైవేట్ హౌస్ లో ఒక అమ్మాయిపై దాడి చేశాడు ఎజ్రా. బాగా లేట్ కావడంతో ఓ 26 ఏళ్ళ మహిళ అక్కడి నుంచి హీరోను వెళ్లిపొమ్మని కోరిందట. అంతే కోపంతో ఊగిపోయిన ఎజ్రా పక్కనే ఉన్న చైర్ తో ఆమెపై దాడి చేశాడట. ఈ దాడిలో మహిళ తలకు ఒక అంగుళం మేర గాయమైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఉదయం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే గడిపిన ఎజ్రా తరువాత బెయిల్ పై బయటకు వచ్చాడు.
Read Also : Nani : పాన్ ఇండియా అంటే ఏంటో తెలీదు !
ఇక మార్చి 28న హవాయిలోని ఓ బార్‌లో ఈ స్టార్ హీరో మహిళా సింగర్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు పోలీసులు ఎజ్రాకు 500 డాలర్ల ఫైన్ వేశారు. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే మరోమారు ఎజ్రా అరెస్ట్ కావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ హీరో చేష్టలకు వార్నర్ బ్రదర్స్ నిర్మాతలు కూడా ఫైర్ అయ్యారని, ఆయన భవిష్యత్తు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది.