Eagle: టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ తరువాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా మొదటి సింగిల్ ఆడు మచ్చ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్రామీణ పండుగ వేడుకలు జరుపుకుంటున్న గ్రామస్థులతో కూడిన రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆడు మచ్చా పాటని ఊరా మాస్ అంథమ్ గా కంపోజ్ చేశారు దావ్‌జాంద్. రవితేజ తన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ పరంగా విభిన్నంగా, మాస్ గా కనిపించాడు. నల్ల చొక్కా, ధోతీ ధరించి, మెడలో రుద్రాక్ష మాలతో పూర్తిగా కొత్త అవతార్ లో ఆకట్టుకున్నాడు.
Aata Sandeep: యానిమల్ లో రణబీర్ ఎంట్రీ.. ఆ స్టెప్స్ నేనే నేర్పించా
దావ్‌జాంద్ అన్ని మాస్ ఎలిమెంట్స్ తో, పక్కా థియేటర్ సాంగ్‌ను రూపొందించాడు. ఈ ట్యూన్ లైవ్ ఇండియన్ పెర్కషన్స్, ఫ్లూట్స్, పేపర్ హొర్న్స్ తో సాంగ్ ప్రోగ్రామింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. రెండిషన్ లోకల్ ఫ్లేవర్ తో అద్భుతంగా అలరించింది. కల్యాణ చక్రవర్తి మాస్ ను ఆకట్టుకునే సాహిత్యాన్ని రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ వాయిస్ తో లైవ్లీ గా పాటని ఆలపించి అలరించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. రవితేజ తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. ఈ పాట అభిమానులకు కన్నుల పండగలా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.