Dunki vs Salaar Collections: డంకీ వర్సెస్ సలార్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయా ? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ , రెబల్ స్టార్ ప్రభాస్ లు పోటాపోటీగా తమ డంకీ – సలార్ చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఈ రెండు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వీకెండ్ ఆ సినిమాకి దొరికినట్లు అయింది. మొదటి వారాంతంలో, డంకీ ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ సాధించినట్టు అంచనా. అలాగే ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా 402 కోట్లు వసూలు చేసిందని అంచనా. సలార్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా, డంకీ ఒరిజినల్ హిందీ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సినిమాలను పోల్చి ఎవరు విజేత అని చెప్పలేం. నిజానికి హిందీలో తప్ప ఇతర భాషల్లో డంకీ, సలార్ మధ్య క్లాష్ లేదు.
Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!
సలార్ – డంకీ మధ్య క్లాష్ హిందీలో మాత్రమే. హిందీలో, డుంకీ ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, సలార్ హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే డంకీ సలార్ కంటే 3 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. అయితే షారుఖ్ ఇమేజ్ కి ఈ నంబర్స్ కూడా అంత పెద్దవి కానందున డంకీ కూడా బాక్సాఫీస్ విజేత అని కూడా దీని అర్థం కాదు. ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, రెండు సినిమాలు మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద అండర్ పెర్ఫార్మెన్స్ చేశాయని అంటున్నారు. లాంగ్ రన్ లో ఈ రెండు సినిమాల ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. వీక్ డేస్ లో రెండు సినిమాలు ఊపందుకోకుంటే రెండు సినిమాలు ఫెయిల్యూర్స్ గా ముగుస్తాయి. అయితే క్రిస్మస్ కూడా కలిసి రావడంతో కొంతవరకు సేఫ్ అయ్యే పరిస్థితులే ఉన్నాయి.