Siva Nirvana about Kushi Movie real life story of Samantha: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లు శివ నిర్వాణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది ఖుషీ. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. దానికి తోడు ఖుషి సినిమాకు సంబంధించిన అన్ని పాటలు చార్ట్ బస్టర్ లుగా నిలిచిన నేపద్యంలో కచ్చితంగా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని సినిమా టీం నమ్ముతోంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు శివ నిర్మాణం మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన సినిమాకి సంబంధించిన అనేక విశేషాలు పంచుకున్నారు. అయితే ఈ సినిమా అంతా ఆఫ్టర్ మ్యారేజ్ కాన్సెప్ట్ లో తెరకెక్కించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ సినిమా సమంత రియల్ లైఫ్ స్టోరీ కి దగ్గరగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన మాట వాస్తవమే అయితే ఆమె నిజ జీవితానికి సినిమాకి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.
Mrunal Thakur:మత్తు లో పడేస్తున్న మృణాల్ ఠాకూర్
నేను ఈ కథ మూడేళ్ల క్రితమే రాసుకున్నా కానీ అప్పటికి సినిమాలో హీరోయిన్గా సమంతను నటింపచేయాలనే ఆలోచన లేదు. అప్పటికి ఆమెకు విడాకులు కూడా అవలేదు. ముందుగా విజయ్ కి కథ చెప్పిన తర్వాత పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో సమంత పేరు సజెస్ట్ చేశారు. అలా ఆమె ఈ ప్రాజెక్టులో భాగమైంది తప్ప ఆమె నిజ జీవిత కథ అని జరుగుతున్న ప్రచారం అయితే నిజం కాదని చెప్పుకొచ్చారు. విజయ్ పర్ఫామెన్స్ ని మ్యాచ్ చేయగల ఆర్టిస్ట్ సమంత ఒక్కరేనని భావించి ఆమెను హీరోయిన్గా తీసుకున్నామని అది ఇప్పటికే ప్రూవ్ అయిందని చెప్పకొచ్చారు. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకున్నాం కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది, అదే సమయంలో రష్మిక మందన లేదా ఇతర హీరోయిన్లను తీసుకొని ఉంటే ఈ ప్రశ్న తెర మీదకు వచ్చే అవకాశం లేదు కదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు.