Shailesh : హిట్-3 మూవీతో మంచి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘ఈ సారి జరిగిన శ్రీవారి దర్శనం నిజంగా ఓ అద్భుతం. ఆయనే తన వద్దకు మమ్మల్ని రప్పించుకున్నాడేమో అనిపిస్తుంది. నా కొడుకు నిన్న రాత్రి నిద్రలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సౌండ్ వస్తే నేను నా భార్య వెళ్లి చూశాం. నా కొడుకు చేతిలో స్వామి కీ చైన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చెయ్ అంటూ అడుగుతున్నాడు.
Read Also : Permanent House: పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
అదంతా చూస్తా నాకు చాలా ముచ్చటగా అనిపించింది. దేవుడి వద్దకు వెళ్లడానికి సంకేతాలుగా అనిపించింది. శ్రీవారిని దర్శనం చేసుకునే సమయంలో కూడా ఇలాగే అనిపించింది. శ్రీవారి నుంచి మరోసారి నా కొడుకుకు పిలుపు వచ్చినట్టు సంకేతాలు కనిపించాయి. గర్భగుడిలో కూర్చుంటే అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ భగవంతుడి కృప మా మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే మాకు కావాల్సింది ‘ అంటూ రాసుకొచ్చారు శైలేష్. ఆయన డైరెక్ట్ చేసిన హిట్-3 మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.
Read Also : Eesha Rebba : ఈషారెబ్బా సొగసుల గాలం..