Dimple Hayathi: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఫినిష్ కాలేదు. ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఎన్నో అడ్డంకులు.. హీరోయిన్ మారడం, డీఓపీ మారడం, షూటింగ్ ఆలస్యం కావడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్నారు మేకర్స్.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గుంటూరు కారం సినిమాలో ఒక ఐటెంసాంగ్ పెట్టబోతున్నారట. ఐటెంభామ కోసం చాలామందిని అనుకోని చివరికి డింపుల్ హాయతి దగ్గరకు వచ్చి ఆగినట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్ నీ హైట్ అనే ఐటంసాంగ్ తో ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. తన డస్కీ అందంతో ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఆ తరువాత రామబాణంలో మెరిసింది. అయితే ఈ సినిమాలు ఏవి అమ్మడికి విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్ తో తగాదా పెట్టుకొని అందరి కళ్లలో పడింది. దీంతో డింపుల్.. ఈ ఐటెంసాంగ్ కు పర్ఫెక్ట్ అని త్రివిక్రమ్.. భావించి.. ఊర మాస్ సాంగ్ లో అమ్మడిని దించుతున్నాడని సమాచారం. ఇది హిట్ అయితే.. డింపుల్ రేంజ్ మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి త్వరలోనే డింపుల్ ను అధికారికంగా అభిమానులకు పరిచయం చేస్తారా.. ? లేక థియేటర్ లో చూపిస్తారా.. ? అనేది చూడాలి.