Dil Raju: బిగ్ సర్ ప్రైజ్.. ‘ఎఫ్3’ లో పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపిండిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 27 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ఎక్కువగానే ఉన్న విషయం విదితమే.. అయితే బిగ్ సర్ ప్రైజ్ గా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా చెప్పడం విశేషం.
“మీ అందరికి మరొక సర్ ప్రైజ్ ఉంది.. ఈ చిత్రంలో స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తారు.. నమ్మండి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి పవన్ స్వయంగా నటించారా..? లేక ఆయనకు సంబంధించిన రిఫరెన్స్లు ఏమైనా వాడారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే వెంకటేష్- పవన్ కళ్యాణ్ మధ్య స్నేహ బంధం ఉన్న విషయం విదితమే. ఈ ఇద్దరి కాంబినేషనల్ లో ఇప్పటికే గోపాల గోపాల వచ్చింది. పవన్ నటించిన అజ్ఞాత వాసి లో వెంకటేష్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఈ బంధంతో ఎఫ్ 3 లో పవన్ కనిపించే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటున్నారు అభిమానులు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Also Read
- Khalifa: 'ఖలీఫా' నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
- Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న 'శ్రీనివాస మంగపురం'
తాజావార్తలు
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
-
Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?